4 August, 2026 | 2:32 AM

ఫీజు బకాయిలు చెల్లించాలి

04-08-2026 01:28 AM
  1. పాత విధానంలోనే పథకాన్ని కొనసాగించాలి
  2. లేదంటే పెద్ద ఎత్తు ఉద్యమాన్ని చేపడతాం 
  3. జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌కృష్ణయ్య
  4. ఉన్నత విద్యా మండలి కార్యాలయం ముట్టడి

ముషీరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.8 వేల కోట్లను వెంటనే విడుదల చేసి, పాత విధానంలోనే పథకాన్ని కొన సాగించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు. ఫీజుల బకాయిల కారణంగా సుమారు 14 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కోర్సులు పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం, కాలేజీల్లో ప్రవేశాలు నిరాకరించ డం వంటి సమస్యలు ఎదురవుతున్నాయన్నారు.

బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ నాయకత్వంలో విద్యార్థులు సోమవారం హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా హాజరైన ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమ ర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి, మే ధావులు, బీసీ సంఘాలతో చర్చించి పాత విధానంలోనే అమలు కొనసాగించాలని ఆయన కోరారు.

లేదంటే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  ముదిరాజ్, పగిళ్ల సతీష్ కుమార్, ఆశిష్ గౌడ్, లింగయ్య యాదవ్, భీమ్ రాజ్, నిఖిల్ పటేల్, భారీ అశోక్, సిద్దు యాదవ్, నరేష్ గౌడ్, వంశీ పటేల్, కిరణ్, చిల్లర యశ్వంత్, గోపి, బలరాం తదితరులు పాల్గొన్నారు.