అధికారులు, వలంటీర్లకు సన్మానం
ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్, ఆగసు 3 (విజయక్రాంతి): అందరి సహకారం, కృషి తో మహంకా ళి అమ్మవారి బోనాల జాతర వైభవంగా ని ర్వహించుకున్నామని సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద బోనాల జాతర సందర్భంగా సేవలు అందించిన పలు శాఖల అధికారులు, వాలంటీర్లను శాలువాతో సత్కరించి డెక్కన్ మానవ సేవా సమితి శతాబ్ది ఉత్సవాల మెమేంటోలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దర్శనం కోసం, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయడంలో కృషి చేసిన వివిధ శాఖల అధికారులు, భక్తులకు సేవలు అందించిన వాలంటీర్లు, రెండు రోజుల పాటు ఆలయం వద్దే ఉండి తమ మాధ్యమాల ద్వారా కవరేజ్ చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు ఎమ్మెల్యే తలసాని అభినందనలు తెలిపారు.






