4 August, 2026 | 2:33 AM

ఆర్టీసీ ఎన్నికల బరిలో బీడబ్ల్యూయూ

04-08-2026 01:26 AM
  1. బహుజన్ వర్కర్స్ యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడిగా టీవీఆర్ 
  2. ప్రతి ఆర్టీసీ ఉద్యోగి సమస్యే ఎజెండా 
  3. యూనియన్ నాయకులతో సమావేశంలో టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న 

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనుబంధ బహుజన్ వర్కర్స్ యూనియన్ (బీడబ్ల్యూ యూ) ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎన్నికలకు సంబ ంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్ల న్న అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. యూనియన్ రాష్ట్ర చైర్మన్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్, నాయకులు, గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడిగా టీవీఆర్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యూనియన్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని సమావేశం నిర్ణయించింది. ఆర్టీసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ బలమైన ప్రణాళికతో ముందు కు వెళ్లాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచి ంచారు.

ప్రతి డిపోలో బూత్ స్థాయి నుంచి యూనియన్ నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి పోరాట కార్యాచరణ రూపొందిం చాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న వేతనాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయ నం చేసి, వాటిని ఎన్నికల ప్రధాన అజెండా గా తీసుకుని ఉద్యోగుల ముందుకు వెళ్లాలని నాయకులకు సూచించారు.

ఈ సమావేశంలో టీఆర్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబో యిన ఓదెలు యాదవ్, కార్మిక విభాగం అధ్యక్షులు సంకూరి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు పటేల్ వనజక్క, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, సహాయ కార్యదర్శి గిరి గాని బిక్షపతి గౌడ్, స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగం యాదవ్ తదితరులు పాల్గొన్నారు

సనత్ నగర్ టిమ్స్‌కు పండుగ సాయన్న పేరు పెట్టాలి

సనత్ నగర్‌లో నిర్మిస్తున్న టిమ్స్‌కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడాన్ని ఆయన తీన్మార్ మల్లన్న తీవ్రంగా తప్పుబట్టారు. మర్రి చెన్నారెడ్డి, కొండా వెంకట రంగారెడ్డి వంటి వారు తెలంగాణ ద్రోహులని, పేదలకు భూములు దక్కకుండా చేసిన దొంగల పేర్లు ప్రాజెక్టులకు, రోడ్లకు, భవనలకు, విశ్వవిద్యాలయాల కు ఎలా పెడతారని మండిపడ్డారు. టిమ్స్‌కు తెలంగాణ వీరులైన పండుగ సాయన్న లేదా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని మల్లన్న డిమాండ్ చేశారు.