తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్
హైదరాబాద్, మార్చి16 (విజయక్రాంతి): అసెంబ్లీ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్‌శుక్లా సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కలిసి ఆవిష్కరించా రు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణ లో ఉన్న మహాత్మగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు గవర్నర్ నివాళి అర్పించారు. దేశానికి, సమాజానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
తెలంగాణ తల్లి విగ్ర హం ఆవిష్కరణ అనంత రం సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ఆత్మగౌర వానికి తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీక అన్నారు. ఈ కార్యమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క తదిరులు పాల్గొన్నారు.




