4 May, 2026 | 2:55 AM

నాగరాజు కుటుంబాన్ని పరామర్శించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

04-05-2026 01:33 AM

యాదగిరిగుట్ట, మే 3 : ఇటీవల ఆత్మహత్య చేసుకున్న యాదగిరిగుట్ట పట్టణానికి చెందిన కోనేరు నాగరాజు కుటుంబాన్ని ఆదివారం  ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పరామర్శించారు.  వివాహ వయసు వచ్చిన కొడుకు మృతి చెందడం అ కుటుంబానికి తీరనిలోటు అన్నారు.  వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈయన వెంట మాజీ ధర్మకర్త  పేలిమిల్లి శ్రీధర్ గౌడ్, మాజీ ఉపసర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, గుట్ట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు  బిక్షపతి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కలకుంట శేఖర్ గౌడ్ తదితరులు ఉన్నారు.