బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యం
- బీజేపీ అధికార ప్రతినిధి పీఎల్ శ్రీనివాస్
- డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితేనే మహిళా బిల్లుతో అవకాశాలు
- బీజేపీ మహంకాళి జిల్లా సెక్రటరీ అలేఖ్య ప్రతాప్
- 10న మోదీ రాష్ట్ర పర్యటన విజయంతం చేయాలి
సికింద్రాబాద్, మే 03 (విజయక్రాంతి): నాలుగు దశాబ్దాలుగా ప్రధాని మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అవినీతి రహిత పాలనను అందిస్తోందని బిజెపి అధికార ప్రతినిధి పిఎల్ శ్రీనివాస్ పేర్కొన్నారు.ఈ నెల 10న పెరేడ్ మైదానంలో జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి పిఎల్ శ్రీనివాస్ కోరారు. సికింద్రాబాద్, కంటోన్మెంట్, సనత్‌నగర్ నియో జకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రజలు మోదీ సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు.
బీజేపీతోనే మహిళా సాధికారత, దేశాభివృద్ధి సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ, ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన అనుభవంతో, 1985 విద్యార్థి దశ నుండి నేటి వరకు పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తున్నానని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందని, వారి వైఫల్యాలు ఇప్పటికే స్పష్టమయ్యాయని పి.ఎల్ శ్రీనివాస్ దుయ్యబట్టారు.
ఈ నెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటన చేస్తున్నారనీ, అందులో భాగంగా నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని ఆయ న వివరించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే మోదీ భారీ బహిరంగ సభకు ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కావాలని, ఈ నెల 10న పెరేడ్ మైదానంలో జరగనున్న ప్రధానిమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ మహంకాళి జిల్లా సెక్రటరీ అలేఖ్య ప్రతాప్ కోరారు. ఈ సందర్భంగా బీజేపీ మహంకాళి జిల్లా సెక్రటరీ అలేఖ్య ప్రతాప్ మాట్లాడుతూ.. మహిళలు ఇకపై ఇంటికే పరిమితం కాకుండా ఆర్థిక స్వేచ్ఛను సాధిం చాలని పిలుపు నిచ్చారు.






