22 May, 2026 | 2:39 AM

పంటల సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

22-05-2026 12:49 AM

సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి

ముషీరాబాద్, మే 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో రైతుల ఆరుగాలం కష్టపడి పం డించిన వడ్లు మక్కలో పంటల సేకరణలో ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని,  వెంటనే ముఖ్య మంత్రి జ్యోక్యం చేసుకొని తగు ఆదేశాలు అధికారులకు జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం వివిధ జిల్లాల నుంచి రైతులు విద్యానగర్లోని బీసీ భవనకు వచ్చి తాము పడుతున్న బాధలు కష్టాలు, ఎంపీ ఆర్. కృష్ణయ్యకు విజ్ఞప్తి చేశారు.

రైతుల పక్షాన పోరాటం చేయడానికి నాయకత్వం వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఆర్. కృష్ణయ్య రైతుల పక్షాన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వడ్లు, మక్కలు సేకరిస్తుందని,  సేకరణలో రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి వేలాది ఫిర్యాదులు అందుతున్నాయన్నారు.

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ర్యాగ అరుణ్ కుమార్, బీసీ సంఘం నేతలు జిల్లపల్లి అంజి,  పల్లగొర్ల రాందేవ్ మోడీ, మేకల రాములు రైతులు పాల్గొన్నారు.