నేటి నుంచి రైతు వారోత్సవాలు
- తాండూరులో ప్రారంభం కానున్న వేడుకలు
- టీజీ ఆర్గానిక్ యాప్‌ను ఆవిష్కరిస్తాం : మంత్రి తుమ్మల
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రైతు వారోత్సవాలను సోమవారం నుంచి ఈనెల 9 తేదీ వరకు నిర్వహించనున్నట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ వేడుకలను తాండూరు నుంచి ప్రారంభిస్తామని, అలాగే టీజీ ఆర్గానిక్ యాప్‌ను ఆవిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఈ వారోత్సవాలు రైతుల ఇంటి వద్దకే చేరే కార్యక్రమంగా రూపొందించామని, రాబోయే వ్యవసాయ సీజన్‌కు రైతుల్లో నమ్మకం పెంపొందించేందుకు దోహదపడుతుందని ఆదివా రం ఒక ప్రకటనలో మంత్రి వివరించారు.
శాఖల మధ్య సమన్వయం సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్లు నోడల్ అధికారులుగా వ్య వహరిస్తూ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రతి రోజూ ఒక ప్రత్యేక శాఖకు కేటాయించి కార్యక్రమాలు నిర్వహిస్తామని, మొద టి రోజు మట్టి ఆరోగ్యం, సమతుల ఎరువుల వినియోగం, సహజ వ్యవసాయం వంటి అంశాలపై అవగాహన కల్పించనున్నట్లు మంత్రి చెప్పారు.
రెండో రోజు ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో పంటల విభిన్నీకరణ, మైక్రో ఇరిగేషన్ వంటి అంశాలపై కార్యక్రమాలు జరుగుతాయని, మూడోరోజు సహ కార, మార్కెటింగ్ శాఖల ద్వారా మార్కెట్ లింకేజులు, రుణ సదుపాయాలపై వివరాలు అందిస్తామన్నారు. నాలుగో రోజు యాంత్రీకరణ, డ్రోన్ల వినియోగం, సౌరశక్తి పరిష్కారాలపై ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఐదో రోజు పశుసంవర్ధక, మత్స్య శాఖలు పశు ఆరోగ్యం, చేపల ఉత్పత్తి పెంపుపై అవగాహన కల్పిస్తాయని, చివరిరోజు సాగునీటి శాఖ వర్షాకాలానికి ముందస్తు చర్యలు, నీటి వనరుల నిర్వహణపై మార్గనిర్దేశనం చేస్తుందని వివరించారు. రైతు వారోత్సవాలను తాండూరులో సోమవారం ప్రారంభిస్తున్నామని, అదేవిధంగా టీజీ ఆర్గానిక్ యాప్‌ను ఆవిష్కరించి సేం ద్రీయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం ఒక పటిష్ట వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే రైతు వారోత్సవ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.






