6 July, 2026 | 3:25 AM

హైదరాబాద్ యూత్ లీగ్ ప్రారంభం

06-07-2026 02:20 AM

హైదరాబాద్, జూలై 5: యువ ఫుట్‌బాల్ ప్లేయర్స్‌ను గ్రాస్ రూట్ స్థాయి నుంచే ప్రోత్సహించే లక్ష్యంతో హైదరాబాద్ యూ త్ లీగ్ (హెచ్‌వైఎస్)హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హైదరాబాద్ ఫుట్‌బాల్ లీగ్, హైద రాబాద్ సూపర్ లీగ్, హైదరాబాద్ ఫుట్‌బాల్ అకాడమీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.

అకాడమీలు, క్లబ్‌లు, విద్యా సంస్థలకు ఏడాది పొడవునా స్థిరమైన పోటీ వేదికను అందించడం దీని లక్ష్యం. ఈ లీగ్ ఆగస్టు నుండి మే వరకు ఛాంపియన్‌షిప్ మోడల్‌లో నడుస్తుంది, అండర్ -8, అండర్- 10, అండర్- 13, అండర్- 16, అండర్ -18 వయో విభాగాల్లో పోటీలు జరుగుతాయి. ప్రతి పోటీలోని ప్రదర్శన మొత్తం సీజన్ ఛాంపియన్‌షిప్ పాయింట్లకు జత చేస్తారు.  ఒక టోర్నమెంట్లో విజయం సాధించడం కంటే, అన్ని విభాగాల్లో నిలకడగా రాణించేందుకు చక్కని వేదిక కానుంది.

యువ ఫుట్‌బాల్ ప్లే యర్లు నిరంతరం పోటీపడి, ఏడాది పొడవునా అభివృద్ధి చెందేందుకు హైదరాబాద్ కు ఎప్పటి నుండో ఒక స్థిరమైన వేదిక అవసరం ఉందని హైదరాబాద్ యూత్ లీగ్ కో ఫౌండర్ ఫైజ్ ఖాన్ తెలిపారు. ప్రతి అకాడమీ, క్లబ్, పాఠశాలకు అర్థవంతమైన పోటీ లభించేలా ప్రతి యువ ఆటగాడికి క్రమం తప్పకుండా మ్యాచ్ అనుభవం ద్వారా మెరుగుపడే అవకాశం అందించే వ్యవస్థను నిర్మించాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు. ఈ ప్రారంభ సీజన్ ఆగస్టులో మొద లవుతుందనీ, రిజిస్ట్రేషన్లు, పోటీ వివరాలు త్వరలో ప్రకటించనున్నట్టు వెల్లడించారు.