6 July, 2026 | 3:24 AM

నిప్పులు చెరిగిన గుర్నూర్ బ్రార్

06-07-2026 02:22 AM

శ్రీలంక ఏపై భారత్ ఏ విజయం

అనధికార టెస్ట్ సిరీస్ కైవసం

గాలే, జూలై 5: శ్రీలంకలో ట్రై సిరీస్ గెలిచిన భారత్ అనధికారిక టెస్ట్ సిరీస్‌లోనూ అదరగొట్టింది. రెండో టెస్టులో 10 వికెట్ల తే డాతో ఘనవిజయం సాధించి సిరీస్‌ను కైవ సం చేసుకుంది. ఈ మ్యాచ్   మొదటి ఇన్నింగ్స్‌లో శ్రీలంక ఏ జట్టు 366 పరుగులకు ఆ లౌటైంది. భారత బౌలర్లలో గుర్నూర్ బ్రార్, సారాన్ష్ జైన్ నాలుగేసి వికెట్ల తో సత్తాచా టారు. తర్వాత భారత్ 543 పరుగుల భారీ స్కోర్ చేసింది.

భారత ఓపెనర్ సాయి సుదర్శన్ 267 బంతుల్లో 168 (22 ఫోర్లు) భారీ సెంచరీ చేయగా దేవదత్ పడిక్కల్, కెప్టెన్  జురేల్, సారాన్ష్ జైన్ హాఫ్‌సెంచరీలతో మెరిశారు. ఆ తర్వాత 177 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ను ప్రా రంభించిన శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది.మరోసారి గుర్నూర్ బ్రార్ 6 వికె ట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించాడు. దీంతో ఆతిథ్య శ్రీలంక భారత్ ముందు కేవలం 33 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది. ఈ లక్ష్యాన్ని భారత్ ఏ జట్టు వికెట్ నష్టపోకుండా 6.2 ఓవర్లలో చేధించింది.