6 July, 2026 | 3:25 AM

పరాగ్వేపై ఫ్రాన్స్ విజయం

06-07-2026 02:19 AM

ఫిల్‌డెల్ఫియా, జూలై 5: సాకర్ ప్రపంచకప్‌లో ఫ్రాన్స్ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. రౌండ్ ఆఫ్ 16 ఉత్కంఠభరిత పోరులో పరాగ్వేపై 1 తేడాతో విజయం సాధించిం ది. మ్యాచ్ 70వ నిమిషంలో ఫ్రాన్స్ జట్టు కెప్టెన్ కైలియన్ ఎంబాపే పెనాల్టీ ద్వారా అందించిన ఏకైక గోల్ ఆ జట్టును క్వార్టర్స్ చేర్చింది.

ఈ క్రమంలో ఎంబాపె అరుదైన రికార్డు నెలకొల్పాడు. ప్రపంచ కప్ టోర్నీలో 19 గోల్స్ చేసి మెస్సి రికార్డును సమం చేశాడు. అయితే మ్యాచ్ అనంతరం జరిగిన ఓ వివాదం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైం ది. పరాగ్వే గోల్ కీపర్ ఓర్లాండ్ గిల్ ఎంబాపెపై ఆగ్రహంతో బంతిని విసిరాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడనుండగా.. పరాగ్వే  ఈ ప్రపంచ కప్‌లో ప్రశంసనీ య ప్రదర్శనతో టోర్నీని ముగించింది.