10 July, 2026 | 3:08 AM

బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపించిన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

10-07-2026 02:08 AM

భిక్కనూర్, జూలై 9 (విజయ క్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ధకని బాల్రాజు ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తనవంతు సహాయంగా బాధిత కుటుంబానికి నిత్యావసర సరుకులను స్థానిక కాంగ్రెస్ నాయకుల ద్వారా పంపించారు.

కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని, అవసరమైన సహాయం అందిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాధవరెడ్డి, వసంత, నట్ట లింగం, శ్రీను, స్వామి, బాబు, రమేష్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.