10 July, 2026 | 3:07 AM

సర్ ప్రక్రియలో లోపాలున్నాయంటూ బీఆర్‌ఎస్ పార్టీ ఆందోళన

10-07-2026 02:07 AM

దోమకొండ, జూలై 9 (విజయక్రాంతి) ః సర్ ప్రక్రియలో లోపాలున్నాయని దోమకొండ బిఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. దోమకొండ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ పార్టీ బుధవారం పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు.  ప్రస్తుతం కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ ఐ ఆర్ కార్యక్రమంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ, ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్కు అనుగుణంగా ఎస్ ఐ ఆర్ ప్రక్రియ ఆశించిన వేగంతో సాగడం లేదని ఆరోపించారు.

2002 ఓటరు జాబి తా అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ బూత్ లెవల్ అధికారులకు బి ఎల్ ఓ లుపూర్తిగా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు.ప్రతి ఇంటికి వెళ్లి ఫారాలు పంపిణీ చేసి, తిరిగి సేకరించాల్సిన విధానం సమర్థవంతంగా అమలు కావడం లేదని, జూన్ 25 నుంచి ఇప్పటి వరకు ఫారాల పంపిణీ, సేకరణ ఆశించిన స్థాయిలో జరగలేదని తెలిపారు. జూలై 24తో గడువు ముగియనున్న నేపథ్యంలో మిగిలిన సమయం చాలా తక్కువగా ఉందని, ఫారాల పంపిణీ, నింపించడం, సమర్పణ ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రస్తుతం కొనసాగుతున్న తీరును బట్టి జూలై 24 నాటికి ప్రక్రియ పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదని, గడువులోపు ఒక్క అర్హుడైన ఓటరు కూడా జాబితా నుంచి తొలగిపోకుండా, అనర్హులు జాబితాలో మిగలకుండా అధికారులు కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో మండల బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి బొమ్మెర శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, యువజన అధ్యక్షుడు పాలకుర్తి శేఖర్, సీనియర్ నాయకుడు  బొమ్మెర గంగాధర్, కానుగంటి నాగరాజు, చెన్నుగారి నర్సింలు, కుంచాల సత్యం, విజయ్, నాయకులు బొబ్బసాని శంకర్, మల్లెబోయిన రాజు, బీసు శివ తదితరులు పాల్గొన్నారు.