మంథనిలోని 5 మండలాలకు ఉపాధి హామీ పథకం కింద రూ.6.83 కోట్ల నిధులు
రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కృషి తో గ్రామీణ అభివృద్ధి పనులకు నిధుల మంజూరు
మంథని, మార్చి 6(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని పెద్దపల్లి జిల్లాకు చెందిన ఐదు మండలాల్లో గ్రామీణ అభివృద్ధి పనుల కోసం మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం ( ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ ) కింద రూ.6 కోట్ల 83 లక్షల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్రైన్ లు ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
మంజూరైన నిధుల్లో మంథని మండలానికి రూ.298 లక్షలు, ముత్తారం మండలానికి రూ.110 లక్షలు, రామగిరి మండలానికి రూ.140 లక్షలు, కమాన్పూర్ మండలానికి రూ.85 లక్షలు, పాలకుర్తి మండలానికి రూ.50 లక్షలు కేటాయించా రు. మంథని మండలంలోని అడవిసోమన్పల్లి, ఆరెంద, బెస్తపల్లి, భట్టుపల్లి, బిట్టుపల్లి, చిల్లపల్లి, చిన్నఓదెల, దుబ్బపల్లి, ఎక్లాస్పూర్, గద్దలపల్లి, గోపాల్పూర్, గుమ్నూర్ (లక్ష్మీపూర్), గుంజపడుగు, కాకర్లపల్లి, కన్నాల (వేంపాడు), ఖానాపూర్, ఖా న్సాయిపేట, లక్కేపూర్, మైదుపల్లి, మల్లేపల్లి, నాగారం, నగరంపల్లి, నాగేపల్లి (స్వర్ణపల్లి), పోతారం, పుట్టపాక, సిరిపురం, సూరయ్యపల్లి, తోటగోపయ్యపల్లి, ఉప్పట్ల, వెంకటాపూర్ గ్రామాలకు నిధులు కేటాయించారు.
ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్, ధర్యాపూర్, హరిపురం, ఇప్పలపల్లి, జిల్లెల్లపల్లి, కేశనపల్లి, ఖమ్మంపల్లి (రంగయ్యపల్లి), మచ్చుపేట, మైదంబండ, ముత్తారం, పారుపల్లి, పోతారం, సీతంపేట గ్రామాలకు నిధులు మంజూరయ్యాయి. రామగిరి మండలంలోని ఆదివారంపేట, బేగంపేట, బుధవారంపేట, చందనాపూ ర్, జల్లారం (సింగరెడ్డిపల్లి), కల్వచెర్ల, లద్నాపూర్, లొంకకేసారం, ముస్త్యాల, నాగేపల్లి, నవాబ్పేట, పన్నూర్, రాజాపూర్, రత్నాపూర్, సుందిళ్ళ గ్రామాలకు నిధులు కేటాయించారు. కమాన్పూర్ మండలంలోని గొల్లపల్లి, గుండారం, జూలపల్లి, కమాన్పూర్, నాగారం, పెంచికల్పేట, పేరపల్లి, రొంపికుంట, సిద్దిపల్లి గ్రామాలకు నిధులు మంజూరయ్యాయి. పాలకుర్తి మండలంలోని బామ్లానాయక్ తండా, జీడీనగర్, కన్నాల, రాణాపూర్ గ్రామాలకు నిధులు కేటాయించారు.




