సాంస్కృతిక సారథి కళాకారుల బదిలీ
బదిలైనా అధికారులను సన్మానించిన డిపిఆర్‌ఓ శ్రీనివాస్
మహబూబ్నగర్ అర్బన్ జూలై 16: జిల్లాలో గత ఐదేళ్లుగా సేవలందిస్తున్న తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నలుగురు గురువారం నాగర్కర్నూల్ జిల్లాకు బదిలీ అయ్యారు. బదిలీపై వెళ్తున్న ఎం. జయప్రకాష్, బైండ్ల లక్ష్మణ్, కె. విజయకాంత్, కె. ఉదయ్కుమార్లు కలెక్టరేట్లోని పౌర సంబంధాల శాఖ కార్యాలయంలో జిల్లా పౌర సంబంధాల అధికారి పి. శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. అనంతరం డీపీఆర్వో పి. శ్రీనివాస్ వారిని పూలమాలలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డిపిఆర్‌ఓ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ, గత ఐదేళ్లుగా ఈ నలుగురు కళాకారులు ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ పథకాల ప్రచారంతో పాటు పరిసరాల పరిశుభ్రత, రోడ్డు భద్రత, ఓటరు అవగాహన, బాలకార్మికుల నిర్మూలన, మూఢనమ్మకాల నిర్మూలన తదితర సామాజిక అంశాలపై కూడా వారి ఆటపాటల తో జానపద కళారూపాల ద్వారా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






