17 July, 2026 | 2:03 AM

బాధ్యతగా పనిచేయండి.. కుటుంబ సభ్యుల పేర్లు నిలపండి

17-07-2026 01:48 AM

కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మహబూబ్ నగర్ జూలై 16: ఉద్యోగం వచ్చిందని సంబరపడడంతో పాటు మీ కుటుంబ సభ్యులకు పేరు ప్రఖ్యాతులు వచ్చేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అన్నారు. కారుణ్య నియామకాల ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థులకు గురువారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కౌన్సెలింగ్ నిర్వహించారు.

మొత్తం 23 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా, అందులో 15 మంది జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు, 8 మంది అటెండర్ పోస్టులకు హాజరయ్యారు. రోస్టర్ పాయింట్ల ఆధారంగా అర్హతలను పరిశీలించి నలుగురు అభ్యర్థులను వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్లుగా, ఐదుగురిని అటెండర్లుగా నియమించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, జిల్లా పరిపాలన అధికారి సువర్ణరాజు, సంబంధిత శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.