7 March, 2026 | 4:36 PM

Breaking News

108 అంబులెన్స్ లో అర్ధరాత్రి ఆడపిల్ల జననం   •   ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   తాగునీటి సమస్యను పరిష్కరించిన సర్పంచ్ నేనావతి   •   ఇందిరమ్మ ఇండ్ల డబ్బులు వెంటనే చెల్లించాలి: మున్సిపల్ చైర్మన్ జ్యోతి   •   బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •  

అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పిద్దాం

07-03-2026 12:41 AM

* ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

* వేములవాడ లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికకు శ్రీకారం

వేములవాడ, మార్చి 6,(విజయక్రాంతి) వేములవాడ పట్టణంలో ప్రజాపాలనప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ కలిసి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రో జుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం సంక్షే మ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చే స్తోందన్నారు. ప్రజాపాలనప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపాలిటీల్లో ఆరు విభా గాల్లో స్పెషలిస్ట్ వైద్యులతో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

వేముల వాడ నియోజకవర్గానికి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరైందని, స్థల సేకరణ కొనసాగుతోందన్నారు. వేములవాడకోరుట్ల బస్సు స్టాండ్ మార్గంలో రోడ్డు పూర్తి చేశామని, రూ.47 కోట్లతో రాజరాజేశ్వర ఆలయం నుంచి మూలవాగు వరకు రోడ్డు విస్తరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి పనులతో పాటు భీమేశ్వర ఆలయంలో భక్తులకు వసతులు కల్పించామని చెప్పారు. మర్రిపల్లి, కలికోట సూరమ్మ ప్రాజెక్టులు, కాలువల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

వేములవాడ నుంచి కోరుట్ల (ఎఖీన్పూర్) వరకు రూ.160 కోట్లతో 100 ఫీట్ల నాలుగు లైన్ల రహదారిని హ్యామ్ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు.నియోజకవర్గంలో 628 మందికి ఇందిరమ్మ ఇళ్లు, 7,020 మందికి రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 3,003 మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయని చెప్పా రు. 1,200 మంది రైతులకు రుణమాఫీ, 3,722 మందికి రైతు భరోసా, 7,147 కుటుంబాలకు గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్ అందుతుందని వివరించారు. 80 మంది రైతులకు సన్న వడ్ల బోనస్, 653 మందికి కల్యాణలక్ష్మీషాదీ ముబారక్ చెక్కు లు అందించామని తెలిపారు.

వేములవాడకోరుట్ల ఫోర్ లైన్ రోడ్డు రాష్ట్ర నిధులతోనే వేములవాడ నుంచి కోరుట్ల వరకు నిర్మించనున్న 100 ఫీట్ల ఫోర్ లైన్ రహదారి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక నిధులతోనే మంజూరైందని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. కేంద్ర నిధులతో వచ్చినట్లు బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారం తప్పుదారి పట్టించేదని అన్నారు. రూ.160 కోట్లకు పైగా వ్యయంతో ఈ రహదారి చందుర్తి, రుద్రంగి, కథలాపూర్, సిరికొండ మార్గంగా ఎఖీన్పూర్ వరకు విస్తరించనుందని తెలిపారు.

అనంతరం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజాపాలనప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లలో పరిశుభ్రత పనులు చేపట్టాలని సూచించారు. డంపింగ్ యార్డులను పూర్తి స్థాయిలో వినియోగించాలని, యువతకు జాబ్ మేళాలు నిర్వహించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. రైతులు ఫార్మర్స్ రిజిస్ట్రీలో తమ వివరాలు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 2న గ్రామసభ నిర్వహించనున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు రెసి డెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తామని, అవసరమైతే వేముల వాడ ఏరియా ఆసుపత్రి లేదా జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తామన్నారు. వేములవా డలో ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగంగా పూర్తి చేసి ఉగాదికి గృహ ప్రవేశాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కా ర్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.