కాంగ్రెస్ కార్యకర్తకు ఎమ్మెల్యే నివాళి
గాంధారి, ఏప్రిల్ 22 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త సయ్యద్ అల్తాఫ్ ఇటీవల గుండెపోటుతో మరణించారు.. ఈ నేపథ్యంలో పలు కార్యక్రమాలకు హాజరవడానికి గాంధారి మండలానికి విచ్చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు మరణించిన కార్యకర్త ఇంటికి వెళ్లి ఆయన ఫోటో వద్ద పుష్పాలు ఉంచి నివాళులు అర్పించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్తాఫ్ తనకి అత్యంత సన్నిహితుడని, అల్తాఫ్ మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు..
అల్తాఫ్ తో తనకు గల సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే కార్యకర్త కుటుంబానికి పార్టీ, తను ఎల్లప్పుడూ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఆకుల శ్రీనివాస్, ఏఎంసీ వైస్ ఛైర్మన్ ఆకుల లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సింగసాని శ్రీనివాస్, సీనియర్ నాయకులు తూర్పు రాజులు, కామెల్లి బాలరాజు ,సంగని బాలయ్య, సంగని బాబా, తాన్ సింగ్, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు..






