18 April, 2026 | 9:33 AM

స్టాన్లీ ఈసీఈ విద్యార్థినులకు ప్రథమ బహుమతి

18-04-2026 01:20 AM

జాతీయ సిలికాన్ ల్యాబ్స్ ఛాలెంజ్‌లో రూ.5 లక్షలు కైవసం

హైదరాబాద్, ఏప్రిల్ 17(విజయక్రాంతి): హైదరాబాద్ అబిడ్స్‌లోని స్టాన్లీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (ఆటానమస్) లోని ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ) విభాగానికి చెందిన విద్యార్థినులు ప్రతిష్ఠాత్మకమైన సిలికాన్ ల్యాబ్స్ ఎడ్జ్ ఇంటెలిజెన్స్ ఛాలెంజ్‌ల్లో ఐదు లక్షల రూపాయల నగదు పురస్కారంతో కూడిన ప్రథమ బహుమతిని సాధించి సంస్థకు కీర్తి తెచ్చారు.

ఈ సందర్భంగా సిలికాన్ ల్యాబ్స్ సీనియర్ డైరెక్టర్ ఎన్. వెంకటేష్ అభినందనలు తెలిపారు. చివరి సంవత్సరం విద్యార్థినులు ధన్యశ్రీ, చారిత, క్రిస్టినాలతో కూడి న జట్టు, గురువారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ) సహకారంతో నిర్వ హించిన జాతీయ స్థాయి పోటీలో ఈ విశిష్ట విజయాన్ని సాధించింది.

సెప్టెంబర్ 2025లో ప్రారం భమైన ఈ పోటీలో దేశవ్యాప్తంగా 450 జట్లు పాల్గొనగా, వాటిలో ఎంపికైన 9 ఫైనలిస్టులలో స్టాన్లీ జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీకి దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల నుంచి ప్రతిభావం తులైన యువ ఆవిష్కర్తలు హాజరయ్యారు.

ఈ విజయంపై కాలేజ్ యాజమాన్యం కరస్పాండెంట్  కె. కృష్ణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ బీఎల్ రాజు, డీన్ డాక్టర్ ఏ. వినయబాబు, విభాగాధిపతి డాక్టర్ కేఎన్ సహు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థినులను అభినందించారు.అలాగే, అధ్యాపక మార్గదర్శకులు బి. హారిక, డా. గుంత కార్తిక్, చంద్రకర్ కృషిని ప్రశంసించారు.వారి మార్గదర్శకత్వం, నిరంతర ప్రోత్సాహం ఈ విజయానికి కీల క కారణమని పేర్కొన్నారు. ఈ విజయం విద్యార్థులలో సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం, పరిశ్రమలకు అనుసంధానమైన విద్యను అభివృద్ధి చేయడంలో సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.