18 April, 2026 | 7:52 AM

సీబీఎస్‌ఈ ఫలితాల్లో సెయింట్ పీటర్స్ విద్యార్థులు విజయకేతనం

18-04-2026 01:19 AM

హనుమకొండ టౌన్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి): హనుమకొండ ఓల్ బస్ డిపో రోడ్ లోని సెయింట్ పీటర్స్ సెంట్రల్ పబ్లిక్ స్కూల్ సి బి ఎస్ సి బోర్డు వారు ప్రకటించిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణన సాధించినారు. తెలుగు, ఇంగ్లీష్, సైన్స్, సాంఘిక శాస్త్రంలలో 100/100 మార్కులు పొంది, పాఠశాలకు ఘనతను సాధించి పెట్టినవారు.

(486/500) మార్కులు సాధించి ఆహారాజుద్దీన్ ప్రథమ స్థానం, (481/500) సాధించి ఉదయపాల్ రెడ్డి ద్వితీయ స్థానం, సాహిత్ (460/500), ప్రీతిక రెడ్డి (458/500), కృష్ణ (456/500) లు విజయం సాధించారు. ఈ సందర్భమును పురస్కరించుకొని పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మత్యాస్ రెడ్డి, డైరెక్టర్ సునీత రెడ్డిలు విద్యార్థులను, తల్లిదండ్రులను ఈ విజయానికి కారకులైన ఉపాధ్యాయ బృందాన్ని ప్రశంసించారు.