15 July, 2026 | 12:35 AM

బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఏర్పాట్లను పరిశీలించిన నీలిమ

15-07-2026 12:35 AM

సికింద్రాబాద్, జూలై 14 (విజయక్రాంతి): టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి డాక్టర్ కోట నీలిమ మంగళవారం ప్రసిద్ధ శ్రీ బల్కంపేట ఎల్లమ్మపోచమ్మ దేవాలయాన్ని సందర్శించి రానున్న బోనాల మహోత్సవాల ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఆలయ ప్రాంగణంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, చేపడుతు న్న ఏర్పాట్లను ఈఓ వినోద్, ఏసీపీ రాఘవేందర్ రావు, సీఐ శ్రీనివాస్ రెడ్డి, వాటర్ వ రక్స్ మేనేజర్ మౌనిక, టీజీఎస్పీడీసీఎల్ ఏఈ మౌనిక, జీహెచ్‌ఎంసీ డీఈ వెంకటేష్, డిప్యూటీ ఎంఆర్‌ఓ రాజు సంబంధిత అధికారులతో కలిసి సమీక్షించారు. ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తు లు తరలివచ్చే నేపథ్యంలో ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, సంస్కృ తి, సంప్రదాయాలకు ప్రతీ క అని అన్నారు. ఈ ఉత్సవాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారని, అందువల్ల వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నీలిమ సూచిం చారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీసు, ట్రాఫిక్, విద్యుత్, నీటి సరఫరా శాఖల అధికారులు, ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.