14 July, 2026 | 9:32 PM

శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలి

14-07-2026 09:06 PM

- హుజూర్ నగర్ సిఐ చరమందరాజు

హుజూర్ నగర్: శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని హుజూర్ నగర్ సిఐ చరమందరాజు కోరారు. మంగళవారం పట్టణంలోని ఇందిరాచౌక్ నందు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ చరమంద రాజు మాట్లాడుతూ... జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ ఆదేశాల మేరకు అక్రమ రవాణాపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందన్నారు.వానాకాలం వరి నాట్ల సీజన్ ప్రారంభమైనందున రైతులు తమ వ్యవసాయ పనిముట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని రైతులకు సూచించారు. అనంతరం వాహన తనిఖీలలో సరియైన పత్రాలు లేని 26 వాహనాలను సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నరేష్,హనుమా నాయక్,కోటేష్, శ్రీకాంత్,గోపాల్ రెడ్డి,బలరాంరెడ్డి, సిబ్బంది,పాల్గొన్నారు.