15 July, 2026 | 12:36 AM

యూట్యూబ్ ద్వారా బర్రెలు కొనుగోలు

15-07-2026 12:36 AM
  1. సైబర్ క్రైమ్‌కు గురైన మర్కుక్ గ్రామ రైతు 
  2. నిందితున్ని రిమాండ్‌కు చేసిన పోలీసులు 
  3. యూట్యూబ్ ప్రకటనలు నమ్మొద్దు.. గజ్వేల్ సీఐ రవి 

సిద్దిపేట క్రైమ్, జూలై 14: యూట్యూబ్ లో వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని సిద్దిపేట జిల్లా గజ్వేల్ రూరల్ సిఐ రవిరాజు సూచించారు. సంగారెడ్డి జిల్లా బీరంగూడ మండలం అమీన్పూర్ కు చెందిన పల్లె సాయికిరణ్ లక్ష్మీ డెయిరీ ఫార్మ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ గేదెలు(బర్రెలు) అమ్మకానికి ఉన్నట్లు వీడియోలు అప్లోడ్ చేసి సైబర్ క్రైమ్ పాల్పడుతున్నట్లు సీఐ తెలిపారు. సిద్దిపేట జిల్లా మార్కూక్ గ్రామానికి చెందిన సాయిరెడ్డి శంకర్ రెడ్డి యూట్యూబ్లో వీడియోలు చూసి నిందితుడిని సంప్రదించి 10 బర్రెలు కావాలని కోరగా, వాటి ధర రూ.15 లక్షలు అని చెప్పి సుమారు రూ.2లక్షల50 వేలు అడ్వాన్స్గా ఆన్లైన్ ద్వారా తీసుకున్నాడు.

అనంతరం బర్రెలను ఎప్పుడు పంపిస్తారని బాధితుడు పలుమార్లు సంప్రదించి నప్పటికీ నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో లేకపోవడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. బాధితుడు సైబర్ ఫిర్యాదు చేయగా, మార్కూక్ పోలీస్ స్టేషన్ సైబర్ క్రైం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. నాగర్కర్నూల్, వికారబాద్ జిల్లాలోనీ కూడా కొంత మంది రైతులను ఇదే తరహాలో మోసం చేసినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్ కు కాల్ చేసి లేదా www.cybercrime.gov.in వ్బుసైట్లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.