4 July, 2026 | 3:52 AM

దిశ మీటింగ్‌కు ఎమ్మెల్యేల డుమ్మా

04-07-2026 02:47 AM

అన్ని తానై నిర్వహించిన ఎంపి అర్వింద్

కోరుట్ల(జగిత్యాల),జూలై3(విజయక్రాంతి): నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ శుక్రవారం జగిత్యాల సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, అదనపు ఎస్పీ చేతన్ నితిన్, అదనపు కలెక్టర్ రాజ గౌడ్ లతో కలిసి నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశం కు ఎమ్మెల్యే లు డుమ్మా కొట్టారు. ధర్మపురి ఎమ్మెల్యే అయిన మంత్రి అడ్లూరి కానీ, జగిత్యాల,కోరుట్ల ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ రమణ లు హాజరు కాలేదు.

కేంద్రీయ విద్యాలయ స్థల కేటాయింపు విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కి ఎం పి కి గతంలో మాటల యుద్ధం నడిసింది. సమావేశం స్థానికంగా జరిగినా ఈ కారణం చేతనే సంజయి హాజరు కానట్టు తెలిసింది. సమావేశంలో సందర్భంగా ఎంపీ ధర్మపురి అరవింద్, అమృత్ 2.0 కింద చేపట్టిన తాగునీటి సరఫరా పనులను క్షేత్ర స్థాయిలో మరింత వేగవంతం చేయాలని సూచించారు.

గత దిశా సమావేశంలో పెండింగ్ పనులు జూన్-2026 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినప్పటికీ పనులు ఆశించిన స్థాయిలో పూర్తికాలేదన్నారు. ఇకపై ప్రతి సమావేశంలో ప్రాజెక్టు వారీగా భౌతిక, ఆర్థిక పురోగతి, వ్యయ వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

సకాలంలో పనులు పూర్తి చేయకపోతే కేంద్ర నిధులు కోల్పోయే ప్రమాదం ఉందని, తద్వారా జిల్లా అభివృద్ధి దెబ్బతింటుందని అన్నారు.జగిత్యాలలో కేంద్ర విద్యాలయం ఏర్పాటుకు తప్పనిసరిగా 10 ఎకరాల భూమిని కేటాయించాలని సూచించారు. అంతకంటే తక్కువ విస్తీర్ణంలో కే.వి. స్కూల్ నిర్వహించడం ఇబ్బంది గా ఉంటుందని తెలిపారు.