చెత్తకుప్పలో ఆడశిశువు
02-05-2026 02:48 AM
పీక్కుతున్న కుక్కలు
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఘటన
జడ్చర్ల, మే 1 : మహబూబ్‌నగర్ జిల్లా జ డ్చర్లలో శుక్రవారం అమానవీయ ఘటన చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును శుక్రవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు జడ్చర్ల పట్టణంలోని హౌసింగ్ బో ర్డ్ కాలనీ గుట్ట సమీపంలోని చెత్తకుప్పలో పడేశారు. దీంతో వీధి కుక్కలు పీక్కుతిన్నాయి.
కాలనీకి చెందిన కొందరు చిన్నారులు క్రికెట్ అడుతూ అక్కడికి వెళ్లి చూడగా అప్పటికే మృతి చెందిన శిశువు కనిపించడంతో కాలనీవాసులకు సమాచారం అం దించారు. వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు లు దర్యాప్తు చేపట్టారు. కాగా అప్పటికే మృతి చెందిన శిశువు రెండు కాళ్లు కుక్క లు పీక్కుతిన్నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.






