మెడికవర్‌లో హార్ట్ చెకప్ ప్యాకేజీ ప్రారంభం
ప్యాకేజీ ఆవిష్కరించిన సైబరాబాద్ అసిస్టెంట్ కమిషనర్
హైదరాబాద్, మే ౧(విజయక్రాంతి): మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో శుక్రవారం ఎసెన్షియల్ హార్ట్ చెకప్ ప్యాకేజ్‌ను అధికారికంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా హృదయ సంబంధిత వ్యాధుల నివారణ, ప్రారంభ దశలోనే గు ర్తింపుపై తమ కట్టుబాటును ఆసుపత్రి మరోసారి నిరూపించింది. ఈ ప్రారంభ కార్యక్ర మానికి ముఖ్య అతిథిగా మాదాపూర్ ట్రాఫి క్ విభాగం, సైబరాబాద్ కమిషనరేట్‌కు చెందిన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కె. చంద్రశేఖర్ రెడ్డి హాజరై ప్యాకేజీని ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ ఈ రోజుల్లో వేగవంతమైన జీవనశైలిలో హృదయ సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి. ఇలాంటి ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ముందస్తు గుర్తింపునకు, సమయానుకూల చికిత్సకు ఎంతో అవసరం.
ఇలాంటి కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంచి, వారి ఆరోగ్యంపై బాధ్యత తీసుకునేలా ప్రోత్సహిస్తాయన్నారు. కొత్తగా ప్రారంభించిన ఎసెన్షియల్ హార్ట్ చెకప్ ప్యాకేజ్‌లోరాండమ్ బ్లడ్ షుగర్ (ఆర్‌బీఎస్), ఈసీజీ, 2డీ ఈకో, లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు, నిపుణులైన కార్డియాలజిస్టుతో సంప్రదింపు ఉన్నాయి.ఈ ప్యాకేజ్ హృద య సంబంధిత ప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు సహాయపడుతుంది.
ప్రారం భ ఆఫర్‌లో భాగంగా, అసలు ధర రూ.3, 100 ఉన్న ఈ ప్యాకేజ్‌ను పరిమిత కాలానికి కేవలం రూ.1,000కి అందిస్తున్నారు, ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ, నేటి జీవన శైలిలో కూర్చునే అలవాట్లు, ఒత్తిడి, కుటుం బ చరిత్ర వంటి కారణాల వల్ల హృదయ పరీక్షలు అత్యవసరమని తెలిపారు. వైద్యులు, అతిథులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్ 31 మే 2026 వరకు అందుబాటులో ఉంటుంది.






