ఫీజు రీయింబర్స్‌మెంట్ రద్దుకు కుట్ర
- విద్యార్థుల నుంచే ఫీజు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు తీర్పునకు ప్రభుత్వమే కారణం
- రేపు రాష్ట్ర వ్యాప్తంగా జీవో 7 ప్రతుల దహనం
- జూన్‌లో లక్ష మంది విద్యార్థులతో హైదరాబాద్ దిగ్బంధం
- బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్
ముషీరాబాద్, మే 1 (విజయక్రాంతి): 2008లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పేద వి ద్యార్థుల ఉన్నత చదువులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకువస్తే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చే యాలని కుట్ర చేస్తుందని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాదులోని బషీర్బాగ్ ప్రెస్‌క్ల బ్‌లో బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో జాజుల శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడారు.
విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసుకోవచ్చు అని హైకో ర్టు ఉత్తర్వులు జారీ చేసేందుకు ప్రభుత్వ తీరే కారణమని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యధావిధిగా కొనసాగి స్తామని హైకోర్టుకు నివేదించాల్సిన ప్రభు త్వం ఇందుకు విరుద్ధంగా యజమాన్యాల ఖాతాలకు కాకుండా విద్యార్థుల ఖాతాలకే ఫీజుల నిధులు చెల్లిస్తామంటూ జీవో 7 విడుదల చేసిందని తెలిపారు. అడ్మిషన్ సమయంలో కాకుం డా ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టంగా చెప్పకుండా విద్యార్థి ఖాతాలోనే జమ చేస్తామనడం అంటే, హైకోర్టు తీర్పు తో ప్రభుత్వం ఏకీభవిస్తున్నట్టేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తక్షణమే ఈ పథకాన్ని యధావిధిగా అమలు చేస్తామని హైకోర్టుకు తెలుపాలని, అలాగే గత నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఫీజుల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఈ పథకం నీరు గార్చి, పేద బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, విద్యార్థుల నుండే కాలేజీలు నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని తీర్పులు వస్తుంటే బీసీ మంత్రులు ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అఖిలపక్ష విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వ కుట్రలను వ్యతిరేకిస్తూ ఈ నెల 3న రాష్ట్రవ్యాప్తంగా జీవో నెంబర్ 7 ప్రతులను దహనం చేయాలని, ఎక్కడికక్కడ నిరసన ప్రదర్శనలు ధర్నాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. సమావేశంలో బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ సంఘాల నేతలు బత్తిని రాజు, గణగాని మల్లేష్, ఎరుకల యతీశ్వర్ గౌడ్, మహేష్ మేరు, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






