17-02-2026 11:58:24 AM
జడ్చర్ల: వాతావరణ శాఖ(Department of Meteorology) సమాచారం మేరకు ఉరుములు మెరుపులు వడగళ్లతో కూడిన అకాల వర్షాలు(Rains) వచ్చే ప్రమాదం ఉందని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి నష్టపోకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందించుకోవాలని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Jadcherla MLA Janampally Anirudh Reddy) పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో మొదటి అకాల వర్షాలు ఈనెల 22 న రాష్ట్రమంతటా ప్రారంభమైయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపత్యంలో మంగళవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో ప్రజలను, రైతులను అప్రమత్తం చేశారు.
ఫిబ్రవరి 22 న ఆదిలాబాద్ నుండి జగిత్యాల, మంచిర్యాల మీదుగా ములుగు వరకు ఉత్తర, తూర్పు తాలూకా ప్రాంతాల్లో చెదురుమదురుగా తుఫానులు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిందన్నారు. ఫిబ్రవరి 23,24 తేదీల్లో హైదరాబాద్ తో పాటు పలుప్రాంతాలలో తూర్పు, దక్షిణ తాలూకాలో చెల్లా చెదురుగా తుఫానులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారని చెప్పారు. కొన్ని చోట్ల వడగళ్ల వానలు వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం 20-40 మి.మీ వరకూ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం కూడా ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
అకాల వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రైతులు తాము ఆరుగాలం కష్టించి పండించిన పంటలు నష్టపోకుండా చూసుకోవాలని చూసుకోవాలని సూచించారు. ప్రస్తుతం వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల్లో ఏవైనా మార్పులు ఉంటే వాటిని గురించి ఫిబ్రవరి 20న ప్రకటిస్తారని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని అనిరుధ్ రెడ్డి కోరారు. ప్రస్తుతం వేరుశనగ పంట చేతికి రావడం జరిగిందని సరైన రీతిలో చదును చేసుకుని వర్షాల నుంచి రక్షణ పొందేలా చూసుకోవాల్సిన బాధ్యత రైతులపై ఉందని తెలిపారు.