17-02-2026 11:45:03 AM
తల్లి బిడ్డ క్షేమం.. డెలివరీ చేసిన 108 సిబ్బంది
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): అంబులెన్స్ లోనే ఓ బిడ్డ ఆయుషు పోసుకున్నది. వివరాల్లోకి ఇలా ఉన్నాయి. మహబూబ్ నగర్ సమీపంలోని గడ్డమీది తండా కు చెందిన ప్రియాంక అనే గర్భిణీ మహిళా కు పురిటి నొప్పులు రావడంతో 108 కుటుంబ సభ్యులు కాల్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆ తాండకు చేరిన 108 సిబ్బంది గర్భిణీ మహిళలు అంబులెన్స్ ద్వారా మహబూబ్ నగర్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తీసుకు వస్తున్న క్రమంలో పురిటి నొప్పులు అధికం కావడంతో వాహనాన్ని పక్కనే ఆపారు.
అంబులెన్స్ లోనే ప్రసవం అయ్యేందుకు అంబులెన్స్ సిబ్బంది ప్రత్యేక వైద్య చికిత్సలు అందించారు. ప్రియాంకకు ఆడబిడ్డ జన్మించింది. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా క్షేమంగా ఉన్నారని 108 సిబ్బంది తెలియజేశారు. తల్లి ఇరువురిని జనరల్ హాస్పిటల్ కు వైద్య చికిత్స నిమిత్తం చేర్పించారు. డెలివరీ చేసిన వారిలో కుటుంబ సభ్యులతో పాటు పైలట్ మహమూద్,టెక్నీషియన్ లక్ష్మణ్ గౌడ్ ఉన్నారు.