9 May, 2026 | 2:34 AM

ప్రతి ఒక్కరూ స్వీయ గణనలో పాల్గొనాలి

09-05-2026 01:20 AM

కలెక్టర్ స్నేహ శబరిష్ 

మహబూబాబాద్ మే 8 (విజయక్రాంతి): స్వీయ గణన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని వారి యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని, తద్వారా దేశ అభివృద్ధికి తోడ్పాటు అందించినట్లు అవుతుందని జనాభా గణన కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరూ పాల్గొని వారి యొక్క ఐడీ ని పొందాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ సూచించారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే అన్ని విభాగాలలో ప్రభుత్వ, ప్రైవేటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ తదితర ఉద్యోగస్తులు తమ వివరాలను నమోదు చేసుకున్నారని, మరింత విస్తృత ప్రచారం కల్పించడం కోసం శుక్రవారం స్వీయ జన గణన ప్రచార రథం ప్రారంభించారు.

ఆడియో, వీడియో, వివిధ సామాజిక మాధ్యమాలు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు ఈ జన గణన పై విస్తృత అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు. అనంతరం మహబూబాబాద్ పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ భవనాన్ని ఆకస్మికంగా కలెక్టర్ తనిఖీ చేశారు. ఇప్పటికే దాదాపుగా పూర్తి అయిన భవనం యొక్క పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి సిద్ధం చేయాలని తెలిపారు.

అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, విద్యుత్ సరఫరా, తదితర పనులు పూర్తి కావడంతో మిగిలిన చిన్న చిన్న వర్కులను తక్షణమే పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట సిపిఓ శ్రీనివాసరావు, డి పి ఆర్ ఓ రాజేంద్రప్రసాద్, వెటర్నరీ జిల్లా అధికారి డాక్టర్ కిరణ్ కుమార్, వ్యవసాయశాఖ అధికారిని సరిత, ఉద్యానవనశాఖ అధికారి జి.మరియన్న, ఏడిఏ శ్రీనివాసరావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ వెంకట్ లకావత్, ఆర్ అండ్ బి ఈ ఈ పాల్గొన్నారు.