విద్య వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలి
మహబూబాబాద్, మే 8 (విజయక్రాంతి): ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈనెల 11 నుంచి 17 వరకు మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యా వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి, ఇంటర్మీడియట్ అధికారి, అన్ని మండల విద్యాశాఖ అధికారులతో కలసి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా, మే 11 నుండి 17 వరకు జరిగే ప్రత్యేక విద్య వారోత్సవాల నిర్వహణ, విద్యాశాఖ పై జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
మైనర్ రిపేర్లు చేపట్టిన వసతుల ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు, సమ్మర్ క్యాంపుల నిర్వహణ, పీఎం శ్రీ పాఠశాలల్లో క్యాంపులు ఏర్పాటు, పదవ తరగతి, ఇంటర్మీడియట్ రీమెడియన్ క్యాంపుల నిర్వహణ, ప్రతి సబ్జెక్టు వారీగా నిపుణుల చేత బోధనలు, హాజరు శాతం పర్యవేక్షణ పురోగతిపై సమీక్ష మధ్యాహ్న భోజనం అందించుట, ఏ డీ స్థాయి అధికారి చేత పర్యవేక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సత్యనారాయణమూర్తి, ఇంటర్మీడియట్ అధికారి మదార్, విద్యాశాఖ ప్లానింగ్ ఏసీజీ విభాగాల అధికారులు శ్రీరాములు, అప్పారావు, పూర్ణచందర్, సంతోష్, సురేష్, తదితరులు పాల్గొన్నారు.






