9 May, 2026 | 2:34 AM

చివరి ఆయకట్టు వరకు రైతులకు నీరందిస్తాం

09-05-2026 01:21 AM

తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు 

తుంగతుర్తి, మే 8: చివరి ఆయకట్ట వరకు రైతులకు సాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు. ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా శుక్రవారం మండల పరిధిలోని దేవుని గుట్ట తండా గ్రామంలో నీటిపారుదల ఆయకట్టు అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ అధ్యక్షతన రైతు వారము కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  గుడిపాటి సైదులు హాజరై మాట్లాడారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం విశ్వసించి రైతును రాజును చేయడమే లక్ష్యంగా చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించడంతోపాటు, రైతు రుణమాఫీ, బోనస్ ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నారు. ఆర్డిఆర్ ఎస్సారెస్పీ పేస్ - 2 కాలువ ద్వారా తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు మందుల సామెల్ సహకారంతో వేసవి పంటకు నీరు అందించి రైతన్నలను ఆదుకున్నారని తెలిపారు. 

నియోజకవర్గంలో 38 కోట్ల రూపాయలు మంజూరు చేసి వాటిని రిపేర్ చేస్తున్నట్లు తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యే  సహకారంతో అధిక నిధులు నీటిపారుదల శాఖకు తీసుకురావడం జరిగిందని తెలిపారు. కొన్ని చెక్ డ్యాములకు, చెరువులకు అభివృద్ధి పనులకు గాను ఎస్టిమేట్ వేసి ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు. న్యూ స్కాంక్షన్లోని అందరి భాగస్వామ్యం వల్ల ప్రతి సీజన్లో చెరువులకు ఎస్సారెస్పీ నీటిని నింపుకుంటున్నట్లు తెలిపారు.

రైతు నీటిని సద్వినియోగం చేసుకొని పంటలను మంచిగా పండించుకుంటే మనమందరం బాగుంటామని తద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు. తొలుత జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం, ముఖ్యమంత్రి సందేశాన్ని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఈఈ సత్యనారాయణ గౌడ్ గ్రామ సర్పంచ్ గుగులోతు స్వాతి భాస్కర్, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ సబ్ డివిజన్ ఇంజనీర్ కిష్టయ్య, నాగారం సబ్ డివిజన్ ఇంజనీ సునీత,తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, వెంపటి గ్రామ సర్పంచ్ తప్పట్ల ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.