5 June, 2026 | 9:58 PM

నాగిరెడ్డిపేట్ మండలంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం

05-06-2026 08:52 PM

నాగిరెడ్డిపేట్,(విజయ క్రాంతి): అంతర్జాతీయ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండలంలోనీ అన్ని గ్రామాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా "స్వచ్ఛ గ్రామం సురక్షిత జల వాయువు" అనే అంశంపైన ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించడము జరిగింది. ఈ పర్యావరణ, పరిరక్షణ,పరిశుభ్రత,ఘన ద్రవ వ్యర్ధాల నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగం,నీటి వనరుల శుభ్రత,ఇతర ముఖ్యమైన అంశాల గురించి చర్చించడం జరిగింది. గ్రామ సభకు హాజరైన వారితో పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ  సర్పంచ్లు,ఉప సర్పంచ్లు, కార్యదర్శిలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డ్ మెంబర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.