భిక్కనూరు పశువైద్య అధికారిగా డాక్టర్ మౌనిక
05-06-2026 08:50 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ పశువైద్య అధికారిగా డాక్టర్ మౌనిక పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇంతకుముందు వైద్యాధికారిగా విధులు నిర్వహించిన డాక్టర్ దేవేందర్ రామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామానికి బదిలీపై వెళ్ళారు. ఆయన స్థానంలో డాక్టర్ మౌనిక శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులు పశు వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.






