18 April, 2026 | 1:02 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

హామీలు నెరవేర్చాల్సిందే..

18-04-2026 01:24 AM

గజ్వేల్‌లో ఉద్యోగుల ఆగ్రహం

గజ్వేల్, ఏప్రిల్ 17: రాష్ట్ర జేఏసీ పిలుపుతో గజ్వేల ఐఓసీ కార్యాలయం వద్ద ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్న భోజన విధాన సమయంలో  నిరసన చేపట్టారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, 2వ పీఆర్సీ అమలు చేయాలని, బకాయి డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం కోరుతూ ప్రభుత్వానికి ఘాటు హెచ్చరికలు చేశారు.

హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ తాలూకా ట్రెజరర్ ప్రవీణ్, జిల్లా టిఎన్జీవో వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం వెంకట్  టిఎన్జీవో జిల్లా మహిళా విభాగం నుండి జబినా సుల్తానా, టి ఎన్ జీవోఓ ఇతర నాయకులు జిల్లా పెన్షనర్ల సంఘసహా అధ్యక్షులు రాజేష్, గజ్వేల్ పెన్షనర్ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు, కార్యదర్శి రామకృష్ణ రెడ్డీ, రాష్ట్ర నాయకులు ఏ మల్లికార్జున్ అన్ని ఉపాధ్యాయ సంఘాలు పాల్గొనడం జరిగింది.

నిరసన కార్యక్రమం అనంతరం గజ్వేల్ తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ట్రెజరర్ ప్రవీణ్, జిల్లా టిఎన్జీవో వైస్ ప్రెసిడెంట్ నాగభూషణం, వెంకట్, టిఎన్జీవో జిల్లా మహిళా విభాగం నుండి జబినా సుల్తానా,  ఇతర  జిల్లా పెన్షనర్ల సంఘం సహా అధ్యక్షులు రాజేష్, గజ్వేల్ పెన్షనర్ సంఘం అధ్యక్షులు నాగేశ్వరరావు  మరియు కార్యదర్శి రామకృష్ణ రెడీ గారు CPS రాష్ట్ర నాయకులు ఏ మల్లికార్జున్, అన్ని ఉపాధ్యాయ సంఘాలు పాల్ల్గొన్నారు .నిరసన కార్యక్రమం అనంతరం గజ్వేల్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు.