18 April, 2026 | 2:36 PM

సాంకేతిక రంగంలో విద్యార్థులు ముందుకు రావాలి

18-04-2026 01:25 AM
  1. హైదరాబాద్ సెక్షన్ ఐటీ వైస్ చైర్మన్ బాల ప్రసాద్,

విద్యా జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి హ్యాకథాన్ నిర్వహణ

మొయినాబాద్ ఏప్రిల్ 17(విజయ క్రాంతి): ప్రస్తుత కాలంలో సాంకేతిక ఆవిష్కరణలు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు కొత్త ధోరణులను అవలంబిస్తూ ఉన్నత విద్యలో ముందుకు సాగాలని హైదరాబాద్ ఐఈఈ సెక్షన్ వైస్ చైర్మన్ బాల ప్రసాద్ సూచించారు. శుక్రవారం మొయినాబాద్లోని విద్యా జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో జాతీయ స్థాయి హ్యాకథాన్2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల చైర్మన్ పళ్ళ రాజేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన బాల ప్రసాద్ మాట్లాడుతూ, విద్యార్థులు స్పష్టమైన లక్ష్యంతో సాంకేతిక రంగంలో కొత్త ఆలోచనలను అన్వేషిస్తూ ముందుకు సాగాలని సూచించారు. నూతన నైపుణ్యాలు సాధించడంపై దృష్టి పెట్టి ఉన్నత విద్యలో మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ. సృజన, డీన్ పద్మజ, అకాడమిక్ ఇన్చార్జ్ జి. శ్రీలత, ప్లేస్మెంట్ డైరెక్టర్ వెంకటాచలం, కన్వీనర్ డాక్టర్ అరుణకుమారి కీలక పాత్ర పోషించారు.కార్యక్రమంలో ప్రొఫెసర్లు, అధ్యాపకులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.