ప్రాణం తీసిన ఆఫ్‌లైన్ ఇసుక రవాణా?
- ప్రాణం ఖరీదు పది లక్షలు !
- ప్రమాదంలో మరణించిన యువ డ్రైవర్
- అతివేగంతో వెళ్లిన టిప్పర్
నారాయణపేట జిల్లాలో షేర్నపల్లి గ్రామానికి చెందిననరేష్( 23)అనే యువకుడు ఆఫ్ లైన్లో ఇసుకను రవాణా చేస్తున్న సందర్భంగా అతివేగంతో టిప్పర్ వెళ్ళటంతో మలుపు వద్ద టిప్పర్ ను నియంత్రించక పోవటంతో బోల్తా పడటంతో డ్రైవర్ క్యాబిన్ నుండి దూకటంతో ఇసుక, టిప్పర్ మీద పడి మరణించిన ఘటన చోటు చేసుకుంది
నారాయణపేట. జూలై 14(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లాలోనీ షేర్నపల్లి గ్రామానికి చెందిననరేష్ అనే (23 )యువకుడు ఆఫ్ లైన్లో ఇసుకను అక్రమ రవాణా చేస్తుండగా అతివేగంతో వెళ్ళటంతో మదనపల్లి దగ్గర బోల్తా పడటంతో టిప్పర్ మీద పడి మరణించిన ఘటన తెలిసిందే. ముఖ్యంగా పేట జిల్లాలో అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు ఇసుకను ఆఫ్ లైన్లో 18000 తీసుకొని బహిరంగ మార్కెట్లో 30000 కు విక్రయిస్తున్నట్లు సమాచారం.
దీంట్లోరీచ్ యజమానులకు,రెవెన్యూ, పోలీసులకు సదరు నేతలకు బాగ పంపకాలు చేస్తూ ఇసుక మాఫియా లీడర్లు రవాణా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇదే నెలలో జిల్లాలోని షేర్నపల్లి గ్రామానికి చెందిన యువకుడు ఆఫ్ లైన్లో ఇసుకను రవాణా చేస్తుండగా అతివేగంతో వెళ్లి ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే,ఇప్పటి కైన జిల్లా ఎస్పీ ఇసుక అక్రమ రవాణా జరుగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు






