ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం
మే ౫న రిలే నిరాహార దీక్ష
టీఎన్‌జీవో నేతలు
హైదరాబాద్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి): ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మే 5న హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించనున్న ‘రిలే నిరాహార దీక్ష’ సన్నాహక సమావేశం గురువారం నాంప ల్లిలోని టీఎన్జీఓస్ జిల్లా కార్యాలయ ప్రాంగణంలో జరిగింది.
ఈ సమావేశానికి టీఎన్జీఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎం హుస్సేనీ (ముజీబ్)ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించి హైదరాబాద్ జిల్లా ఇన్-చార్జి డాక్టర్ ముజీబ్ వ్యవహరిస్తూ, కార్యక్రమం విజయవంతం కావడానికి అవసరమైన అన్ని వసతులు, ఏర్పాట్లను సమ కూర్చనున్నట్లు జిల్లా చైర్మన్ ఎస్. విక్రమ్ కుమార్, కన్వీనర్ ఎంబీ కృష్ణ యాదవ్ వెల్లడించారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో పోరాటాన్ని ఉ ధృతం చేస్తామని హెచ్చరించారు.
మే 5న జరిగే ఈ దీక్షలో పాల్గొనే ఉద్యోగులందరూ తప్పనిసరిగా కాజువల్ లీవ్ దరఖాస్తు చేసుకుని, భారీ సంఖ్యలో తరలిరావాలని తీర్మానించారు. రెం డో పీఆర్సీ అమలు, పెండింగ్ బిల్లుల విడుదల, సీపీఎస్ రద్దు వంటి 64 డిమాం డ్ల సాధనలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం లో టీఎస్‌యూటీఎఫ్ నుంచి ఏ. శ్యామ్ సుందర్, డీటీఎఫ్ నుంచి ఎం. వినోద్ కుమార్, ఎస్‌టీయూటీఎస్ నుంచి మొహమ్మద్ ఇఫ్తేకారుద్దీన్, పీఆర్టీయూటీఎస్ నుంచి వి. అశోక్, శ్రీ రమేష్, క్లాస్-4 ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వి.సత్యనారాయణ, టీఎన్జీఓస్ యూనియన్ నుంచి కురాడి శ్రీనివాస్, పి.పేరయ్య, షౌకత్ హుస్సేన్ తదితర నేతలు పాల్గొన్నారు. అన్ని సం ఘాల నేతలు సమన్వయంతో పనిచేసి దీ క్షను విజయవంతం చేయాలని పి లుపునిచ్చారు.






