1 May, 2026 | 10:57 AM

పదో తరగతి ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఎమ్మెల్యే సన్మానం

01-05-2026 02:03 AM

పెబ్బేరు, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను స్థానిక ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఘనంగా సన్మానించారు. పట్టణ కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల, మోడల్ స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత బాలుర, బాలికల పాఠశాలలకు చెందిన టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ, వారి కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు కూడా ప్రతిభతో ముందుకు రావడం గర్వకారణమని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారం వల్లే విద్యార్థులు ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొన్నారు.విద్యార్థులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలు అందజేసి వారి భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రోత్సహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్ పర్సన్ సుమిత్ర ఎల్లారెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గౌని ప్రమోదినిరెడ్డి, వై చైర్మన్ ఎద్దుల విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు శివ సాయి, తాటికొండ కృష్ణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.