పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
01-05-2026 02:01 AM
అలంపూర్ ఏప్రిల్ 30: సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ కాంట్రాక్టర్ కు సూచించారు.ఈ మేరకు గురువారం అలంపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే ప్రధాన రహదారి వద్ద చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు.
పట్టణ ప్రజల అవసరతను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.44 లక్షల రూపాయలను మంజూరు చేయించినట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు.త్వరగా పనులు పూర్తి చేసి ఈ రోడ్డును ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు టెలికం మాజీ అడ్వైజర్ కమిటీ సభ్యులు ఇస్మాయిల్, నరసింహ, బుచ్చన్న ,సురేష్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు,






