10 April, 2026 | 11:11 PM

రైతుసంఘం నూతన మండల కమిటీ ఎన్నిక

10-04-2026 08:57 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జాజిరెడ్డిగూడెం మండల రైతుసంఘం నూతన అధ్యక్షుడిగా సంపతి వెంకన్న,ప్రధాన కార్యదర్శిగా ఎల్లెంల అవిలయ్యతో పాటు 9మంది సభ్యులతో కూడిన కార్యవర్గాన్ని శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి, ఉపాధ్యక్షులు కొలిశెట్టి యాదగిరిరావులు మాట్లాడుతూ... రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు.తమపై నమ్మకం ఉంచి,తమ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర,జిల్లా రైతుసంఘం నాయకులకు నూతన అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.