కఠోర శ్రమతో కల నిజమైన వేళ..!!
ప్రభుత్వ ఉద్యోగం సాధించిన మండల వాసి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్నది ఆమె కల.. చదువుకుంటున్నప్పుడు తల్లితో.. మాట్లాడుతున్నప్పుడు స్నేహితులతో.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకుని కృషి, పట్టుదల, ఆత్మస్థైర్యంతో తీవ్రంగా కష్టపడి కఠోరంగా శ్రమించి తల్లిదండ్రులు, గ్రామస్తులు గర్వించేలా ప్రభుత్వ ఉద్యోగం సాధించి వేల మంది యువతలో స్ఫూర్తి నింపారు.
జాజిరెడ్డిగూడెం మండల వాసి... పూర్తి వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని వేల్పుచర్ల గ్రామానికి చెందిన డేగల జ్ఞానసుందరి కుమార్తె డేగల ప్రతిభ బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసి హైదరాబాదులోని పంజగుట్ట నీమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్టు విభాగంలో నర్సింగ్ ఆఫీసర్ గా పని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం కోసం అహర్నిశలు కష్టపడి చదివి ప్రభుత్వ ఆరోగ్యశాఖలో ఉద్యోగం సాధించింది.జిల్లా మొత్తంలోనే ఓపెన్ కేటగిరీలో ఎంపిక కావడంతో శుక్రవారం తల్లిదండ్రులు,గ్రామస్తులు డేగల ప్రతిభకు అభినందనలు తెలిపారు.




