10 April, 2026 | 10:52 PM

ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం విఫలం

10-04-2026 08:54 PM

తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): యాసంగి వరి ధాన్యం సేకరణ సీజన్ ప్రారంభమైనప్పటికీ గ్రామాల్లో నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు మల్లు నాగార్జునరెడ్డి మండిపడ్డారు.శుక్రవారం మండల కేంద్రం అర్వపల్లిలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యుడు వజ్జె శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు.

మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెంచి త్వరిత గతిన కొనుగోళ్లను వేగవంతం చేయాలని, ఆలస్యమైతే రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొలిశెట్టి యాదగిరిరావు, నాయకులు ఎల్లెంల అవిలయ్య, శిగ వెంకన్న, దేవులపల్లి వీరారెడ్డి, బొల్లం గోపయ్య, మర్రి సైదులు, సంపతి వెంకన్న, వీరస్వామి, శేఖర్, రావుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.