calender_icon.png 8 February, 2026 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా

08-02-2026 01:28:45 AM

కరీంనగర్ 23వ డివిజన్ బీఆర్‌ఎస్ అభ్యర్థి జంగిలి సాగర్

కరీంనగర్ క్రైం,ఫిబ్రవరి7(విజయక్రాంతి) : నగరంలోని 23వ డివిజన్‌లో మరోసారి తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్ అభ్యర్థి జంగిలి సాగర్ అన్నారు. శనివారం డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో ఆ యన ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. సీతారాంపూర్ సర్పంచ్‌గా, కార్పొరేటర్‌గా ఈ ప్రాంతంలో తాను చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసన్నారు. తనకు ఓటు వేసి మరోసారి గెలిపిస్తే, ఈ ప్రాంతాన్ని మరింతగా అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.డివిజన్‌ను ఆద ర్శ డివిజన్‌గా తీర్చిదిద్దుతానని అన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సహకారంతో కాలనీని అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. కా లనీలో చేసిన అభివృద్ధి పనుల వివరలను ప్రజల ముందుంచుతున్నానని తెలిపారు.