calender_icon.png 8 February, 2026 | 4:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గెలుపు బాటలో మైలారపు లింబాద్రి

08-02-2026 01:27:11 AM

మెట్‌పల్లి, ఫిబ్రవరి7 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపల్‌లో 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి మైలారపు లింబాద్రి గెలుపు బాటలో పయనిస్తున్నారు. శనివారం ఆయన పట్టణంలో ని 17వ వార్డులో ప్రచారం చేస్తూ మాట్లాడా రు. గతంలో తాను వైస్ చైర్మన్‌గా కొత్త పెన్షన్‌లు ఇస్తూ రహదారులు, మురుగు కాలువ లు నిర్మించామన్నారు.గత మున్సిపల్ వైస్ చైర్మన్‌గా ఉన్న అనుభవంతో ప్రస్తుతం 17వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచి ముఖ్యమంత్రి రే వంత్ రెడ్డి సహకారంతో మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్‌గా పట్టణాన్ని అభివృద్ధి చేస్తాన న్నారు. జాతీయ రహదారి అభివృద్ధితో పాటు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడతానని హామీ ఇచ్చారు.