2 September, 2026 | 10:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

కలెక్టర్‌కు సన్మానం

14-05-2026 | 01:15am

ములుగు, (మహబూబాబాద్) మే 13 (విజయక్రాంతి): ములుగు జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు తీసుకున్న బోర్ఖడే హేమంత సహదేవరావు ను కలెక్టర్ కార్యాలయంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ములుగు జిల్లా చాలా చిన్న జిల్లా అని, అందులో చాలా వెనకబడిన గిరిజన ప్రాంతం కాబట్టి ములుగు జిల్లా అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ములుగు జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు వంగ రవి యాదవ్, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చింతనిప్పుల బిక్షపతి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లె జైపాల్ రెడ్డి, కౌన్సిలర్ పౌడాల ఓం ప్రకాష్, గుంటోజు శంకరయ్య, మాజీ ఎంపీటీసీ రమేష్, బోడ రఘు, జాఫర్, షకీల్, రాజు, విజయ్, రాంబాబు పాల్గొన్నారు.