2 September, 2026 | 8:55 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్ రెడ్డి

14-05-2026 | 01:14am

మహబూబాబాద్, మే 13 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా వెన్నం శ్రీకాంత్ రెడ్డి బుధవారం బాధ్యతను స్వీకరించారు. వెన్నం బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి సీతక్క, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్ రియాజ్, డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ భూక్యా ఉమ, మాజీ అధ్యక్షుడు జన్నారెడ్డి భరత్ చందర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం కృషి చేసే వారికి పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, ఇందుకు శ్రీకాంత్ రెడ్డి నిదర్శనమన్నారు. జిల్లాలో గ్రంధాలయాల అభివృద్ధితో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు కృషి చేయాలని సూచించారు.