9 May, 2026 | 7:52 PM

అగ్ని ప్రమాద బాధితులకు సరుకుల పంపిణీ

09-05-2026 06:07 PM

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం నందివాడ పరిధిలోని సామదుబ్బ తండాలోని అగ్నిప్రమాద బాధితులకు శనివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిత్యావసర సరుకులు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కె.మదన్మోహన్ రావు అగ్నిప్రమాద బాధితులకు నిత్యావసర సరుకులు పంపించారని తెలిపారు ఎమ్మెల్యే సూచన మేరకు సరుకులు అందిస్తున్నట్లు వారు వివరించారు.ఈ సందర్భంగా బాదితులకు బియ్యం, కిరాణా సామాన్లు, తాటిపత్రి, వంట సామాన్లు అందించారు.బాధితులకు ఎమ్మెల్యే అండగా ఉంటానని హామీ ఇచ్చారని నాయకులు తెలిపారు.