11 April, 2026 | 8:02 PM

ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి

11-04-2026 06:09 PM

దమ్మపేట,(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు పూలే 199. వ.  జయంతిని  సిపిఎం పార్టీ దమ్మపేట మండల కమిటీ పార్టీ కార్యాలయం సుందరయ్య భవనంలో ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా జ్యోతి రావు పూలే చిత్రపటానికి మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మి నారాయణ పూలమాల వేసి నివాళులర్పించారు. 

అనంతరం జరిగిన సభలో మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ... సమానత్వం, సామాజిక న్యాయం కోసం జీవితాంతం విద్య కోసం పోరాడిన అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహనీయుడు గొప్ప సంఘసంస్కర్త, కులవ్యవస్థ లోని అంతరాలను రూపుమాపేందుకు అహర్నిశలు కృషి చేసిన జ్ఞానపధికుడు, స్త్రీ విద్య కై పాఠశాలలను స్థాపించిన దార్శనికుడని ఘనంగా నివాళులు అర్పించారు. ఇంకా ఈ సభలో పార్టీ మండల కమిటీ సభ్యులు కొప్పుల శ్రీనివాస్ రావు. కొలికి పోగు శ్రీనివాస్ రావు. చెన్నుబోయిన బ్రహ్మయ్య,  సిహెచ్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.