13 June, 2026 | 3:20 AM

పేదలకు కాంగ్రెస్ పార్టీ అండ

13-06-2026 01:07 AM

నిర్మల్ జూన్ 12 (విజయక్రాంతి): పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కె శ్రీహరి రావు అన్నారు. గురువారం నిర్మల్ నియోజకవర్గం లోని 40 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన 10 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్సలు పొందిన బాధితులకు ప్రభుత్వం ఈ ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శేఖర్ పార్టీ నేతలు ఉన్నారు.